![]() |
![]() |

ఇంద్రజ ఏది చేసిన ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఆమె స్టేజి మీద మాట్లాడే ప్రతీ మాటను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంద్రజ చాలా డౌన్ టు ఎర్త్ లా కనిపిస్తారు. ఆమె హీరోయిన్ గా ఒకప్పుడు ఎంత మంది ఫాన్స్ ని సంపాదించుకున్నారో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం ఆమెకు చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఆమె నటిగా, జడ్జ్ గా, డాన్సర్ గా మాత్రమే కాదు మంచి వంట చేసే అమ్మగా కూడా అందరికీ పరిచయమే. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె ఆలు పరాఠా చేసి అందరికీ పెట్టింది. అలాంటి ఇంద్రజ తన ఇన్స్టాగ్రామ్ పేజీ రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టారు.
అందులో పీట మీద అల్లం వెల్లుల్లిని నూరుతూ కనిపించారు. అదేంటి మిక్సీలో వేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారు కదా..ఐతే అల్లం వెల్లులిని మెత్తగా నూరి ఆ ముద్దను చేతిలో పట్టుకుని చూపిస్తూ పవర్ కట్ ఐతే ఇంట్లో ఇలా నూరుకోవడం కూడా వచ్చన్నమాట..అట్లుంటది మనతోని మరి అని ఓ రేంజ్ లో డైలాగ్ చెప్పేసరికి నెటిజన్స్ ఫిదా ఇపోయారు. ఆమెకు ప్రశంసల వర్షం కురిపించేసారు. "మీరు ఇంకా పాత పద్ధతులు ఫాలో అవుతున్నారు. ఈ పద్ధతుల్లో పని చేస్తూ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. అమ్మా నువ్వు సూపర్. ఇంద్రజ అమ్మ అంటే అట్టఉంటది మరి తగ్గేదేలే..రంజాన్ ముబారక్...శ్రీదేవి డ్రామా కంపెనీకి మెయిన్ పిల్లర్...స్క్రీన్ వరకే .. ఇంటి కొస్తే .. అమ్మ , భార్య , కోడలు అన్ని రోల్స్ ప్లే చేయాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |